
బాపట్ల, మార్చి 25 (2026): రేపల్లె రెవిన్యూ డివిజనల్ అధికారిణిగా బి. శ్రీదేవి బుధవారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు మొక్కను అందజేసి అభివాదం చేశారు. రేపల్లె డివిజన్ పరిధిలోని రెవిన్యూ అంశాలు మరియు పాలనాపరమైన విషయాలపై కలెక్టర్‌తో ప్రాథమికంగా చర్చించారు. డివిజన్ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన రెవిన్యూ సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్రీదేవి పేర్కొన్నారు.http://BAPATLA NEWS







