
West Godavari:పోలవరం:23/10/2025;-పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు నిరుద్యోగ యువతకు శుభవార్త తెలిపారు. రేపు (శుక్రవారం) కొయ్యలగూడెం ప్రకాశం డిగ్రీ కళాశాలలో నిర్వహించబడనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ జాబ్ మేళాలో నియోజకవర్గంలోని ఏడు మండలాల యువత భారీగా పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ మేళాకు పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ వంటి విద్యార్హతలున్న అభ్యర్థులు అర్హులని తెలిపారు.ఆసక్తిగల అభ్యర్థులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని, రేపు జరిగే ఈ మేళాలో పాల్గొని తమ భవిష్యత్తును మలుచుకోవాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచించారు.







