వికాస్ విద్యాసంస్థలందు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.
పల్నాడు జిల్లా,చిలకలూరిపేట.
చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక సుబ్బయ్య తోటలో వికాస్ స్కూల్స్ వారి విట్ ది స్కూల్ నందు మరియు పెదనందిపాడు రోడ్ లోని వికాస్ స్కూల్ నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన వికాస్ విద్యాసంస్థల డైరెక్టర్ గౌ. శ్రీ. దండా పవన్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆగస్టు 15 మనకు స్వాతంత్ర దినోత్సవ స్వేచ్ఛనిస్తే,ఆ స్వేచ్ఛను సరైన పద్ధతిలో ఉపయోగించుకునే విధంగా మన బాధ్యతలను గుర్తు చేసుకునే రోజుగా జనవరి 26 ను డైరెక్టర్ దండా పవన్ కుమార్ అభివర్ణించారు.
విద్యార్థులకు ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు సరైన రీతిలో ఉపయోగించుకోవాలని,పుస్తక పఠనాన్ని పెంపొందించుకోవాలని మరియు క్రమశిక్షణను పాటిస్తూ,ఏకాగ్రతను సాధించుకోవాలని సూచించారు.భావి భారత పౌరులైన నేటి విద్యార్థులు క్రమశిక్షణతో నేటి విద్యా వనరులను ఉపయోగించుకొని చక్కగా చదువుకొని మంచి స్థానాలను అధిరోహించి దేశానికి సేవ చేయగలరని పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రోజశ్రీ, ప్రిన్సిపల్స్,ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.