యువతను నిర్వీర్యం చేసేందుకు కొందరు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విష్ణువర్ధన్ రావు అన్నారు. డ్రగ్స్ తీసుకునే వారిని లక్షణాల ఆధారంగా వెంటనే గుర్తించవచ్చన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడ్డ వారిని గుర్తించి తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు కే.ఎస్ లక్ష్మణరావు, డొక్కా మాణిక్య వరప్రసాద్, జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
243 Less than a minute