Road exident :రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కు తప్పిన పెను ప్రమాదం.
విజయవాడ
- హెల్మెట్ వినియోగించడం వలన చిన్న చిన్న గాయలతో బయటపడ్డ కానిస్టేబుల్
విజయవాడ: ఎన్.టి.ఆర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఆరవ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మురళి కృష్ణ తన బైక్ పై హెల్మెట్ పెట్టుకుని విధులకు వెళుతున్న సమయంలో కనకదుర్గ ఫ్లైఓవర్ వద్ద అదే దారిలో వేగంగా వస్తున్న టిప్పర్ లారీ బైక్ ను గుద్దడం వలన కిందపడగా తలకు హెల్మెట్ ఉండటం వలన హెడ్ ఇంజూరి అవ్వకుండా చిన్న చిన్న గాయాలతో తన ప్రాణాలను కాపాడుకున్నాడు.తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం ఆంధ్ర హాస్పిటల్ కు పంపించడం జరిగింది.
నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి. రాజ శేఖర బాబు ఐ. పి. ఎస్. కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ ప్రయాణించే సమయంలో విధిగా హెల్మెట్ ధరించాలని ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అదే విధంగా ప్రజలందరికీ హెల్మెట్ ఆవశ్యకత తెలుపుతూ ప్రజలందరూ విధిగా హెల్మెట్ ధరించాలని పలు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం మరియు హైకోర్ట్ వారి ఆదేశాల మేరకు నగరంలో వాహన తనిఖీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపే వారికి హెల్మెట్ లను కూడా అందించడం జరిగింది.
ఈ క్రమంలో నగర పోలీస్ కమీషనర్ సూచనలతో నగరంలో అత్యధికంగా విధిగా హెల్మెట్ ధరించి ప్రయాణాలను సాగిస్తున్నారు. బెంజ్ సర్కిల్ వద్ద ఎ. ఐ ఆర్టిఫిషియిల్ ఇంటిలిజెన్స్ ద్వారా 17 నిముషాలు గమనించగా ఎవరేజ్ గా 84.2 శాతం హెల్మెట్ దరిస్తున్నారని తెలిసింది. రోడ్డు ప్రమాదలలో హెల్మెట్ ధరించకపోవడం వలనే అత్యధికంగా మరణిస్తున్నారు.
కేవలం కానిస్టేబుల్ హెల్మెట్ ధరించడం వలన మాత్రమే రోడ్డు ప్రమాదంలో చిన్న చిన్న గాయలతో బయటపడినాడు. మీ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని మీ ప్రయాణాలను సాగించాలని, ఇది గమనించుకుని ప్రతిఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ వాహనాల ద్వారా ప్రయాణాలను సాగించాలని తెలియజేసారు.