
హెల్మెట్ ధరించటం బరువు కాదు… బాధ్యత

- బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల:
ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించటం బరువుగా అనుకోకుండా నా బాధ్యతగా అనుకుని ప్రయాణం చేయాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల సూర్యలంక రోడ్డులో బాపట్ల డిఎస్పి రామాంజనేయులు నేతృత్వంలో నియోజకవర్గం సిఐలు ఎస్సైలు సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించి హెల్మెట్ అక్కడే కొనుగోలు చేయించి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఉపయోగాలను వాహనదారులకు వివరించారు. అటుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పోలీస్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ ను ప్రశంసించి హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వలన కలిగే అనర్ధాలు కుటుంబం అనాథులుగా మారుతారని కుటుంబం కోసం మన జీవితం కోసం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.







