రేపూడి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ : ముగ్గురు గాయాలు

ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు–ఆటో ఢీకొన్న ప్రమాదం జరిగింది. ఫిరంగిపురం వైపు నుంచి రేపూడి దిశగా వెళ్తున్న ఆటోను, నరసరావుపేట నుండి ఫిరంగిపురం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్నట్టు తెలిసింది.
ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఢీకొన్న ప్రభావంతో ఆటో ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందుకున్న ఫిరంగిపురం పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు







