నరసరావుపేట-రొంపిచర్ల:08-10-25:రొంపిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్న మండల స్థాయి క్రీడాపోటీలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాని శుభారంభం చేశారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో కబడ్డి, కోకో, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడాంశాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల్లో స్పోర్ట్స్ స్పిరిట్‌ను పెంపొందించడంలో ముఖ్యపాత్ర వహిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పీడీలు, ఇతర స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు.