Rotary club of Guntur Vikas: రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు:
గుంటూరు: మేడికొండూరు:
76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ అధ్యక్షులు పరిసే ఆదిశేషు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అమరావతి మండలం మండెపూడి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలో, మరియు మేడికొండూరు మండలం వరగాని గ్రామ మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల లలో, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రిపబ్లిక్ డే ప్రాముఖ్యత గురించి ప్రసంగించారు. అనంతరం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ఆ పాఠశాలల ప్రాంగణాల్లో పండ్లు, పూల మొక్కలు నాటారు.
విద్యార్ధులకు మిఠాయిలు, చాక్లెట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి సుధీర్ బాబు, సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్, పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ సతీష్ బాబు, శ్రీనివాస మణి, పి. చిన్నా చౌదరి, మండవ సాంబశివరావు, యలమంచిలి వేణుగోపాల్ ,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.