chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

JAGAYYAPETA NEWS:మెప్మా ఆర్.పిల సమస్యలు పరిష్కరించాలి- అధికారులకు వినతి

జగ్గయ్యపేట (ఎన్టీఆర్ జిల్లా): తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జగ్గయ్యపేట పట్టణ మెప్మా రీసోర్స్ పర్సన్స్ (ఆర్.పి) వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పి.జి.ఆర్.యస్ (PGRS) కార్యక్రమంలో భాగంగా వారు తమ విన్నపాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ప్రధాన డిమాండ్లు ఇవే:

ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న తమకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. వారి ప్రధాన డిమాండ్లు:

  • ఆర్.పిలకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలి.
  • కనీస గౌరవ వేతనం రూ. 18,600/- కి పెంచాలి.
  • గౌరవ వేతనాన్ని నేరుగా వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయాలి.
  • విధి నిర్వహణ కోసం గుర్తింపు కార్డులు (ID Cards) మరియు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.
  • జీరో (0) రాయితీతో ఎలక్ట్రానిక్ స్కూటీలను మంజూరు చేయాలి.

ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యకు వినతి

తమ సమస్యలపై స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ని కలిసి వివరించినట్లు వారు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కమిషనర్, సీఎంఎం కవితా మరియు టీఎల్ఎఫ్ అధికారులకు కూడా వినతిపత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

పాల్గొన్న ప్రతినిధులు:

ఈ కార్యక్రమంలో పట్టణ మెప్మా ఆర్.పిలు పి. రమాదేవి, యు. భవానీ, కె. శ్రీలక్ష్మి, బి. ఆదిలక్ష్మి, ఎన్. జాన్సీ, ఎం. సైదమ్మ, షేక్ నసిరిన్, పఠాన్ బాజీ, ఎస్.డి. సైదాబీ, పి. మహేశ్వరి మరియు ఇతర సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.http://NTR DISTRICT NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker