chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
అమరావతిఆంధ్రప్రదేశ్

Amaravathi Local News :సాగునీటి సంఘాల పనులకు జీఎస్టీ మినహాయింపుప్రతీ ఎకరాకు సాగునీరు అందేలా కృషి చేయాలి – సీఎం చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 5:- సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ మినహాయింపు ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా సాగునీటి సంఘాల అధ్యక్షులు కృషి చేయాలని సూచించారు. గురువారం అమరావతిలోని నేలపాడు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ‘నీరు–ప్రగతి, జల హారతి – సాగునీటి సంఘాల భాగస్వామ్యం’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

Amaravathi Local News :సాగునీటి సంఘాల పనులకు జీఎస్టీ మినహాయింపుప్రతీ ఎకరాకు సాగునీరు అందేలా కృషి చేయాలి – సీఎం చంద్రబాబు

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను సమర్థ పాలన, స్పష్టమైన ప్రణాళికలతో రైతు అనుకూల రాష్ట్రంగా మార్చామని తెలిపారు. నీటి వనరుల సమర్థ వినియోగంతో కరువు అనే మాటే వినిపించని స్థితి తీసుకురావడమే లక్ష్యమన్నారు.

రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్‌ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే పునాది అని గుర్తు చేశారు. హంద్రీనీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టుల వల్లే నేడు అనంతపురం జిల్లా పండ్ల తోటల వనంగా మారిందన్నారు. మైక్రో ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ ఇచ్చి హార్టికల్చర్‌ను ప్రోత్సహించామని తెలిపారు.

సాగునీటి సంఘాల పనితీరును సీఎం ప్రశంసించారు. 1997లో దేశంలోనే తొలిసారిగా సాగునీటి సంఘాల వ్యవస్థను ప్రవేశపెట్టామని, వాటి ద్వారా 14 లక్షల నీటి సంరక్షణ కట్టడాలు నిర్మించామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి సంఘాల బిల్లులను ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసిందన్నారు.Amaravathi news

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.344 కోట్లతో 7,197 ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు రైతు సంఘాల ద్వారా చేపట్టామని తెలిపారు. నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించే పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ మినహాయింపు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు.

నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరు అందించడమే నిజమైన జల హారతి అని సీఎం పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్‌కు ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. పోలవరం పూర్తయ్యాక నదుల అనుసంధానం చేపడతామని తెలిపారు.

రాయలసీమ ఎత్తిపోతల పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభించిన ప్రాజెక్టును ఎన్జీటీ నిలిపివేసిందని గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం సీమలో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఈ సమావేశానికి మంత్రులు నిమ్మల రామానాయుడు, కె. అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker