

.పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం గ్రామంలోని అరవింద్ ఆశ్రమంలో గల శ్రీ సత్య సాయి ఆరోగ్యం మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బాపట్ల శాసనసభ్యులు వేగేషన్ నరేంద్ర వర్మ రాజు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొని శ్రీ సత్య సాయి బాబా సేవా కార్యక్రమాల గురించి వివరించారు అనంతరం శ్రీ సాయి ఆరోగ్యం మల్టీ స్పెషాలిటీ వైద్యశాలకు 2026 జనవరి నుంచి తన జీవితకాలం పాటు ప్రతి ఏడాది లక్ష రూపాయలు చొప్పున విరాళంగా అందించినట్లు బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ రాజు ప్రకటించారు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా వైద్యశాలకు సిమెంటు రోడ్డు నిర్మాణం కొరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కమిటీ కరుణ్ రాజు డాక్టర్ మంతెన నరసరాజు వేగేసిన కిషోర్ కుమార్ బాపూజీ రాజు గోకరాజు సుబ్బరాజు అల్కాపురం గ్రామ సర్పంచ్ మంతెన గంగరాజు లక్కం రాజు వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు.








