ఆంధ్రప్రదేశ్

TODAY AP: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత..

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో పాల్గొని పలువురు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇంఛార్జి మంత్రి మరియు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణ రెడ్డి

గౌ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్లు క్రమం తప్పకుండా ఇంటి వద్దనే అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్న పలువురు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి01: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన దిశగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసి పేద వారికి ఆసరాగా నిలుస్తోందని, ఎక్కడ చూసినా అధికారులు లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి ఉదయాన్నే పెన్షన్లు తమకు ఇస్తున్నారని, ప్రభుత్వం పట్ల పెన్షన్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని జిల్లా ఇంఛార్జి మంత్రి మరియు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.

నేటి శనివారం ఉదయం శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామ పంచాయతీ హరిజన వాడ నందు పలువురు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, శ్రీకాళహస్తి ఎంఎల్ఏ బొజ్జల సుధీర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తదితర సంబంధిత అధికారులతో, ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. వారు లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి పెన్షన్లను సచివాలయం సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు.

ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే వారి ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని మంత్రులకు తెలిపారు. ఉరందూరు గ్రామ పంచాయితీ ఊరందూరు హరిజన వాడ నందు పీ.సుబ్బమ్మ, జి. లక్ష్మమ్మ, బి. లచ్చమ్మ లకు వితంతు పెన్షన్ రూ.4000 వంతున, టి. పోలయ్యకు వృద్ధాప్య పెన్షన్ రూ. 4000 ను, కె.గోపాల్ విభిన్న ప్రతిభావంతునికి దివ్యాంగుల పెన్షన్ రూ.6000 ను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి అందచేశారు. మంత్రులు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మేలు కోరి వారి సమస్యలను అర్థం చేసుకుని దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను అందిస్తున్నారని తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం అని వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి పెంచి ఇచ్చిన పెన్షన్లు వారి జీవనానికి ఆసరాగా ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పలువురు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button