
వేటపాలెం, జనవరి 20:-స్థానిక సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో జవహర్‌లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ–కాకినాడ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ మెన్స్ క్రికెట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జగదీశ్ బాబు తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు మాట్లాడుతూ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్‌తో పాటు యూనివర్సిటీ జట్టు ఎంపికలు ఈ పోటీల ద్వారా జరుగనున్నట్లు పేర్కొన్నారు.
మొదటి మ్యాచ్‌లో గుంటూరుకు చెందిన కళ్ళం హరినాథ్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, గోదావరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి జట్ల మధ్య పోటీ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కళ్ళం హరినాథ్ రెడ్డి కళాశాల జట్టు 136 పరుగులు చేసింది. అనంతరం గోదావరి ఇన్‌స్టిట్యూట్ జట్టు రెండు వికెట్ల తేడాతో 137 పరుగులు చేసి విజయం సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు.Chirala Local News
తదుపరి మ్యాచ్‌లో విజయవాడకు చెందిన పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల, గుంటూరుకు చెందిన యూనివర్సల్ ఇంజినీరింగ్ కళాశాల జట్ల మధ్య పోటీ కొనసాగుతోందని తెలిపారు.










