
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలానికి చెందిన సాక్షి పత్రిక రిపోర్టర్ జక్రయ్య గారి భౌతిక కాయాన్ని ఏపీయూడబ్ల్యూజే (APUWJ) యూనియన్ నాయకులు, సభ్యులు, నియోజకవర్గంలోని సాక్షి దినపత్రిక సహచర రిపోర్టర్ మిత్రులు సందర్శించి నివాళి అర్పించారు.
తరువాత జక్రయ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ —
“జక్రయ్య జర్నలిజం పట్ల అంకితభావంతో పనిచేశారు. ఆయన మృతితో పాత్రికేయ వర్గం ఓ నిజాయితీ గల సహచరుడిని కోల్పోయింది” అని అన్నారు.
జక్రయ్య కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందించేందుకు యూనియన్ తరఫున చర్యలు తీసుకుంటామని నాయకులు హామీ ఇచ్చారు.







