chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

PENUGANCHIPROLU NEWS:అనిగండ్లపాడు ఎస్సీ కాలనీలో నరకప్రాయం- సమస్యల సుడిగుండంలో ప్రజలు!

పెనుగంచిప్రోలు (ఎన్టీఆర్ జిల్లా): ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు గ్రామ ఎస్సీ కాలనీవాసులు దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలతో అల్లాడిపోతున్నారు. తమ ప్రాంత సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని, పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం స్థానిక ప్రజలు మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కనీస సౌకర్యాలు లేక, అంటువ్యాధుల భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రధాన సమస్యలను వివరిస్తూ.. రెండు నెలల క్రితం కాల్వ పూడికతీతలో భాగంగా తీసిన చెత్తను రోడ్డుకు ఇరువైపులా కుప్పలుగా వదిలేశారని ధ్వజమెత్తారు. ఆ చెత్త కుప్పలు కుళ్లిపోయి భయంకరమైన దుర్వాసన వెదజల్లుతున్నాయని, దోమల బెడదతో పిల్లలు తరచూ డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాల బారిన పడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తక్షణమే ఆ చెత్తను తొలగించి, డస్ట్ బిన్లు ఏర్పాటు చేసి తమ ప్రాణాలను కాపాడాలని వేడుకున్నారు.

PENUGANCHIPROLU NEWS:అనిగండ్లపాడు ఎస్సీ కాలనీలో నరకప్రాయం- సమస్యల సుడిగుండంలో ప్రజలు!

మరోవైపు, కాల్వకు ఇరువైపులా సైడ్ వాల్స్ లేకపోవడం, మట్టి రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వర్షం కురిస్తే ఆ ప్రాంతం నరకాన్ని తలపిస్తోందని, తక్షణమే సిమెంట్ రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, కాల్వపై తగినన్ని కల్వర్టులు లేకపోవడంతో సుమారు 50 మందికి పైగా పాఠశాల విద్యార్థులు ప్రాణాలకు తెగించి తాటి మొద్దులు, సిమెంటు స్తంభాలపై నడుస్తూ కాల్వ దాటుతున్నారని, ఈ క్రమంలో ఇప్పటికే పలువురు పిల్లలు ప్రమాదాలకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులు, పిల్లల భద్రత దృష్ట్యా ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన కల్వర్టులు నిర్మించాలని అనిగండ్లపాడు ఎస్సీ కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.http://NTR DISTRICT NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker