chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Machilipatanam Local News : సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధన అవసరం : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం: జనవరి 3 :సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం యోగా సాధన అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు నగరంలోని చింతగుంటపాలెంలో నిర్వహించనున్న ఉచిత యోగా శిక్షణ తరగతులను ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ యోగాసభ మచిలీపట్నం శాఖ, చింతగుంటపాలెం దివ్య యోగ మందిర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత యోగా శిక్షణ, చికిత్స శిబిరానికి సంబంధించిన కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందన్నారు. అవయవాలు ఉన్నంత వరకు యోగాసనాలు, ప్రాణాలు ఉన్నంత వరకు ప్రాణాయామం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించుకోవడంలో యోగా మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో దోహదపడుతుందన్నారు. యోగ సాధనతో శారీరక, మానసిక ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు.Krishna Local News

ఈ ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రతిరోజూ ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన యోగా నిపుణులచే నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వినియోగించుకోవాలని కోరారు.

అనంతరం ఏపీ యోగాసభ మచిలీపట్నం శాఖ ప్రధాన కార్యదర్శి, యోగా గురువులు మాట్లాడుతూ యోగా గురువు శ్రీ ములకరాజ్ జి మహారాజ్ వారి 127వ జయంతి మహోత్సవాల సందర్భంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాది నుంచి విచ్చేస్తున్న కార్యనిర్వాహక యోగాచారిణి దమయంతి జీ సమక్షంలో ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు ఉచిత యోగా శిక్షణ, చికిత్స శిబిరం జరుగుతుందన్నారు.

మందులు లేకుండా యోగ చికిత్స ద్వారా రక్తపోటు, మధుమేహం, సయాటికా, కీళ్ల నొప్పులు, ఆస్తమా, నరాల బలహీనత, అధిక బరువు వంటి అనేక వ్యాధుల నివారణకు ప్రాణాయామాలు, యోగాసనాలపై శిక్షణ ఇస్తామన్నారు. మహిళలకు ప్రత్యేకంగా యోగ శిక్షణ, చికిత్స అందిస్తామని తెలిపారు.

ఈ నెల 11వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటలకు తిలక ధారణ, 10 గంటలకు పురవీధులలో శోభాయాత్ర, అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు భోజన ప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యోగా గురువులు జి. గురునాథ్ బాబు, మద్దాల చింతయ్య, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ ఎం. వెంకటేశ్వర ప్రసాద్, యోగా సభ్యులు ఆర్. దుర్గాప్రసాద్, జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker