
బాపట్ల:చీరాల:17-10-25:- నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామం వడ్డిసంఘం ప్రాంతానికి చెందిన కోట గౌతమ్ ఇటీవల ఆదివారం సముద్ర స్నానానికి వెళ్లి, అప్పుడు వచ్చిన అలల వృద్ధుతికి గురై ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో కోట గౌతమ్ గారి తల్లి తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారు.ఈ వార్త తెలుసుకున్న చీరాల ఎమ్మెల్యే శ్రీ కొండయ్య గారి కుమారుడు మద్దులూరి గౌరీ అమర్నాథ్ గారు, సోమవారం బాధిత కుటుంబాన్ని వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా దుఃఖంలో మునిగిపోయిన గౌతమ్ తల్లిని ఓదార్చి, కుటుంబానికి మనోధైర్యం చేకూర్చేలా మాట్లాడారు. ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.50,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సాయం చీరాల ఎమ్మెల్యే గారు సూచించిన మేరకు అందించినట్లు తెలిపారు.
ఈ సందర్బంగా కూచన షారోన్ గారు కూడా గౌతమ్ తల్లిని కలిసి ఓదార్చారు. పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గౌరీ అమర్నాథ్ గారితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ విషాద ఘటనపై ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మానవత్వంతో ముందుకు వచ్చి సహాయం అందించిన ఎమ్మెల్యే కుటుంబానికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.







