శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయం లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ గా ఏ. తమీమ్ అన్సారియా ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించారు . ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన బదిలీల్లో తమీమ్ అన్సారియ గుంటూరు జిల్లా కలెక్టర్ గా నియమింపబడ్డారు .జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నాకు గుంటూరు జిల్లా కలెక్టర్ గా అవకాశమిచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్నారు . ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల సమస్యలను పూర్తిగా పరిష్కరించి ,సమర్థవంతంగా పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు .అదేవిధంగా ఎక్కువ ఫీల్డ్ విజిట్స్ కు ప్రయారిటీ ఇచ్చి ఫీల్డ్ కు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని అర్థం చేసుకొని సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానన్నారు .ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు . అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు కృషి చేస్తానన్నారు. అర్హులైన ప్రజలకు అందేలా ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా సమర్థవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు వేగవంతంగా పూర్తిచేయడం జిల్లా స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం జిడిపిని పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ చేపట్టటం జరుగుతుందన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు, మీడియా ప్రతినిధులు మీ అందరి సలహా సహకారంతో కలిసేటట్టుగా పనిచేసే గుంటూరు జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తానన్నారు.కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ ,జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ కే ఖాజావలి. గుంటూరు రెవిన్యూ డివిజనల్ అధికారి కే శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో పూర్ణచంద్రరావు, జిల్లా పరిషత్ సీఈవో జ్యోతి బసు, పి డి ఆర్ డి ఏ విజయలక్ష్మి, డిఇఓ ఈ రేణుక, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి, జి జి హెచ్ సూపర్డెంట్ డాక్టర్ ఎస్ ఎస్ వి రమణ, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి మురళీధర్, డిపిఓ నాగ సాయికుమార్, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దుర్గాబాయి, పిడి మెప్మా విజయలక్ష్మి, పి డి ఐ సి డి ఎస్ ప్రసూన, డి డి హార్టికల్చర్ రవీంద్రబాబు, కలెక్టర్ కార్యాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
1,231 1 minute read