
మంగళగిరి:-డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ వర్చువల్ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు పాల్గొన్నారు. శంకరగుప్తంలో నిర్వహించిన ప్రత్యక్ష కార్యక్రమంలో రాజోలు శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ గారు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌తో పాటు జలవనరుల శాఖ అధికారులు హాజరయ్యారు.
కోనసీమ ప్రాంతంలోని కొబ్బరి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులను రూ. 20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టడం గమనార్హం. ఈ డ్రెయిన్ సమస్య కారణంగా ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుందని అధికారులు తెలిపారు.

రాజోలు పర్యటన సందర్భంగా 45 రోజుల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారని, ఆ హామీని ఆచరణలో పెట్టేందుకు 35 రోజుల్లోపే పనులకు శ్రీకారం చుట్టడం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు. కొనసీమ రైతులకు యూరియా కొరతతో ఇబ్బందులు || Urea Shortage Troubles Farmers in Konaseemaముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమన్వయంతో సమస్యకు వేగంగా పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఆధునికీకరణ పనుల ద్వారా వరద సమస్యలు నివారించడంతో పాటు, కొబ్బరి తోటలు మరియు సాగుభూములు రక్షించబడతాయని అధికారులు వెల్లడించారు.










