Happy mobile: Guntur news బుల్లిరాజు గుంటూరులో సందడి చేశారు.
సంక్రాంతికి వస్తున్న సినిమా నటి ఐశ్వర్య రాజేష్, బుల్లిరాజు గుంటూరులో సందడి చేశారు.
బ్రాడీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ మొబైల్ స్టోర్ ను ఐశ్వర్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షామీ ఇండియా
సీనియర్ మేనేజర్ సయ్యద్ అన్వర్, హ్యాపీ మొబైల్ సంస్థ
చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వడ్లమాని శశి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రెడ్ మీ నోట్ 14 నూతన మొబైల్ ను ఆవిష్కరించారు. సంక్రాంతికి వస్తున్న సినిమాకి మంచి హిట్ ఇవ్వటం ఆనందంగా ఉందని హీరోయిన్ తెలిపారు. త్వరలో మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపారు. గుంటూరు పర్యటనకు రావడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 90 హ్యాపీ మొబైల్ స్టోర్స్ ఏర్పాటు చేశామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. హ్యాపీ మొబైల్స్ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా సరికొత్త ఆఫర్లు ఇస్తున్నట్లు వారు వెల్లడించారు.