సంక్రాంతి సంబరాలు….
సంక్రాంతిని పురస్కరించుకొని
పెనమలూరు నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్
ముప్పారాజా ఆధ్వర్యంలో
సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు,,,…
జాతీయస్థాయి ఎడ్లబల ప్రదర్శన పోటీ కార్యక్రమాన్ని
ముక్కోటి ఏకాదశి పర్వదినాన పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ముప్పా రాజా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన
ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ముఖ్య అతిథులుగా విచ్చేసిన
జనసేనపార్టీ రాష్ట్రకార్యదర్శి అమ్మిశెట్టి వాసు జనసేన పార్టీ మచిలీపట్నం ఇంచార్జ్ బండిరామకృష్ణ ప్రారంభించారు.
జాతీయస్థాయిలో ఏర్పాటుచేసిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలలో పాల్గొనడానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి పోటీ దారులు విచ్చేశారని పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సాంప్రదాయ కార్యక్రమాలలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎడ్లబల ప్రదర్శన పోటీలు రెండు రోజులు కొనసాగుతాయని ముప్పా రాజా తెలిపారు
సంక్రాంతి సంబరాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భోగి మంటలు,మహిళలకు ముగ్గులపోటీలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలను సంక్రాంతి సాంప్రదాయం ఉట్టిపడేలా
నిర్వహిస్తామని ముప్పారాజ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గడ్డంరాజు,కర్రిమహేశ్, పెనమలూరు నియోజకవర్గ జనసైనికులు కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు.