ఆంధ్రప్రదేశ్
PHIRANGIPURAM…సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఫిరంగిపురం మండలం యర్రగుంట్ల పాడు గ్రామంలో సోమవారం రాత్రి వారధి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐ రవీంద్రబాబు మాట్లాడుతూ మొబైల్ ఫోన్లో వచ్చే అపరిచిత కాల్స్ ,లింక్ లకు స్పందించవద్దన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ లఘు చిత్రాలు ప్రదర్శించారు.