ఆంధ్రప్రదేశ్
సంక్రాంతి మహరాణుల ముగ్గుల పోటీలు.
పల్నాడు జిల్లా,చిలకలూరిపేట
వాసవిక్లబ్ చిలకలూరిపేట, వాసవి యంగ్ స్టార్స్, వాసవి గోల్డెన్ , వాసవి వనిత క్లబ్‌ల ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణమండపంలో సంక్రాంతి మహరాణుల ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలకు విశేష స్పందన లభించింది. 8వ వార్డ్ కౌన్సిలర్ కొత్త కుమారి,21వ వార్డ్ కౌన్సిలర్
కనమర్లపూడి లక్ష్మీ తిరుముల, 22వ వార్డు కౌన్సిలర్ కూనల ప్రమీలలు పోటీల పర్యవేక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు పోటీలలో పాల్గొన్నారు.