ఆంధ్రప్రదేశ్గుంటూరు

Guntur News: నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలి

COLLEGE FESTIVAL

గుంటూరులోని చలమయ్య డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, సంకూరి శ్రీనివాసరావు, కళాశాల ప్రతినిధులు, ఇతర అతిధులు పాల్గొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మారుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సాంకేతిక విద్యను అందించేందుకు కళాశాల నిర్వాహకులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా విద్యను అందించాలన్నారు. 

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button