
విజయవాడ, అక్టోబర్ 31:-మొగల్రాజపురం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న శారద విద్యా సంస్థలు మరోసారి జాతీయస్థాయిలో కీర్తి గడించాయి. ఈ విద్యాసంస్థ జూనియర్ ఇంటర్ విద్యార్థిని కె. వసుధ “స్టేట్ లెవెల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్” పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరచి ప్రథమ స్థానం సాధించింది.రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో వసుధ దూకుడు ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. మ్యాచ్‌లో శక్తి, శ్రద్ధ, వ్యూహం సమన్వయంతో క్రీడించి ప్రత్యర్థులను మట్టికరిపించింది. జడ్జిలు ఆమె ఆటతీరును ప్రశంసిస్తూ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా శారద విద్యా సంస్థల చైర్మన్ డా. వై. రమేశ్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ వై. శారదాదేవి, కళాశాల అడ్వైజర్ ఈ.ఎస్.ఆర్. కె. ప్రసాద్, జిఎం జి.వి. రావు విద్యార్థిని వసుధను సత్కరించారు. వసుధ కృషి, పట్టుదల, క్రీడాస్ఫూర్తి ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం సిబ్బంది, కోచ్‌లు, సహ విద్యార్థులు వసుధ విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. “వసుధ సాధించిన ఈ విజయం మా శారద విద్యా సంస్థల గౌరవాన్ని మరింత పెంచింది” అని సంస్థ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.







