
గుంటూరు: డిసెంబరు 31:-భారతదేశంలోని విభిన్న రాష్ట్రాల సాంప్రదాయ ఆహార పదార్థాల ఘుమఘుమలతో గుంటూరు నగరం మరోసారి కళకళలాడనుంది. జాతీయ స్థాయి సారస్ (SARAS – Sale of Articles of Rural Artisans Society) ప్రదర్శనను జనవరి 6 నుండి 18 వరకు గుంటూరులో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

గుంటూరు పట్టణంలోని నర్సరావుపేట రహదారిలో, రెడ్డి కళాశాల ఎదురుగా ఉన్న స్థలంలో సారస్ ప్రదర్శన శాలల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుధవారం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా సెర్ప్ డైరెక్టర్ పద్మావతి, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయలక్ష్మి మాట్లాడుతూ మొత్తం 300 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో 150 స్టాళ్లు ఇతర రాష్ట్రాలవీ కాగా, మరో 150 స్టాళ్లు రాష్ట్రానికి చెందినవిగా ఉంటాయన్నారు.

సారస్ ప్రదర్శనలో హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, చీరలు, షాల్స్, కార్పెట్లు, బెడ్షీట్లు, వెదురు, లోహ, గాజు ఉత్పత్తులు, ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులతో పాటు సాంప్రదాయ, ఆర్గానిక్ ఆహార పదార్థాల ప్రదర్శన మరియు విక్రయం జరగనుంది. గుంటూరు మిరపకు ఉన్న ప్రత్యేక గుర్తింపును దృష్టిలో ఉంచుకుని ఈ సారస్కు **“మిరపకాయ”**ను మస్కట్‌గా ఎంపిక చేశారు.Guntur Local News
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయి సారస్ కార్యక్రమం నిర్వహించబడుతుండటం గర్వకారణమన్నారు. ప్రజలకు ఉచిత ప్రవేశం, ఉచిత పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే ఉత్పత్తులు ఒకేచోట లభించేలా ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, సెర్ప్ డైరెక్టర్ సుధాకర్, డీఆర్డీఏ ఏపీడీ కిరణ్‌కుమార్, డీపీఎం అశోక్, ఎల్డీఎం మహిపాల్‌రెడ్డి, నగర పాలక సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ సుందరరామిరెడ్డి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నరేందర్, పంకజ్‌కుమార్, తహసిల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










