

బాపట్ల, నవంబర్23 : భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను ఆదర్శంగా తీసుకొని ప్రతి వ్యక్తి సమాజంలో సేవ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన పేర్కొన్నారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న ఆదేశాల మేరకు ఆదివారం బాపట్ల పట్టణంలోని భీమా వారి వీధి నందు ఉన్న సాయి బాబా ఆలయం లో జిల్లా యంత్రాంగం మరియు భగవాన్ శ్రీ సత్యసాయి సేవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో జాయింట్ కలెక్టర్ ముఖ్య అథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను ఆదర్శంగా తీసుకొని సమాజంలో ని ప్రతి వ్యక్తి సేవ కార్యక్రమాలు చేయాలన్నారు.భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
బాబా ఆధ్యాత్మిక బోధనలు మరియు మానవతా సేవలకు ప్రసిద్ధి చెందారని, చిన్నతనంలోనే తన ఆధ్యాత్మిక మిషన్‌ను ప్రకటించి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, సేవ అనే సూత్రాల ద్వారా మానవాళిని ఆధ్యాత్మికంగా పునరుజ్జీవింపజేయాలనే సంకల్పంతో విశ్వ వ్యాప్తంగా తన బోధనలు, సేవలు చేయడం జరిగిందని తెలిపారు.
సత్య సాయి బాబా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, విద్యా, వైద్య ఆధ్యాత్మిక తదితర రంగాలలో వారు విస్తృతంగా చేపట్టిన సేవలు నేటికీ కొనసాగుతున్నాని తెలిపారు. అనంతపురం జిల్లాకు త్రాగు నీరు అందించడం వంటి గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. పుట్టపర్తి నందు బాబా ప్రశాంత నిలయము ఆశ్రమాన్ని స్థాపించారు. పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించడం, గ్రామాలకు తాగునీటి ప్రాజెక్టులు అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన అనేక మందిని ప్రేరణగా నిలిచారని అన్నారు.
అంతకు ముందు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా చిత్ర పటానికి పూలమాలలు వేసి పూజ కార్యక్రమాలు నిర్వహించి మంగళ హారతూలు ఇచ్చారు. సాయి బాబా భక్తులు భజనలు, భక్తి కీర్తనలు పలువురు సాయి సేవా బృందం చేశారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ.గంగాధర్ గౌడ్, డి యం & హెచ్ ఓ.డాక్టర్ విజయమ్మ, పిడీలు డ్వామా,ఐ సి డి ఎస్,హోసింగ్, విజయలక్ష్మి, రాధామాదవి,వెంకటేశ్వర రావు,సాంఘిక సంక్షేమ శాఖ డి డి రాజదేబోరా,డి ఈ ఓ.పురుషోత్తం, ఆర్డీఓ పి.గ్లోరియా, తహశీల్దార్ షేక్ సలీమా,సత్యసాయి సేవా సమితి సభ్యులు ప్రసాద్,సుబ్బారావు విజయ,లక్ష్మమ్మ, సత్య సాయి సేవా సమితి సభ్యులు, పలువురు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







