
అమరావతి: నవంబర్ 30:-రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉచిత యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. డా. బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇచ్చే ఈ ఉచిత శిక్షణ కోసం మొత్తం 6,361 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

దరఖాస్తుదారులందరికీ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించగా, భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలితాల ఆధారంగా మెరిట్ సాధించిన అభ్యర్థులకు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో ఉచిత కోచింగ్ అందించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

ఈ శిక్షణ డిసెంబర్ 10, 2025 నుంచి ఏప్రిల్ 10, 2026 వరకు నాలుగు నెలలు కొనసాగుతుందని, ఎంపికైన యువతకు ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కు ప్రత్యేక మార్గదర్శకత అందించబడనుందని అధికారులు పేర్కొన్నారు.







