Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ప్రకాశం జిల్లా

సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసివిద్యార్థులతోమాట్లాడుతున్న ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు

వేటపాలెం, నవంబర్ 5 : – స్థానిక సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పరిసరాల్లో బుధవారం బి.ఫార్మసీ మొదటి సంవత్సరం విద్యార్థుల పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వి. నాగేశ్వరరావు మాట్లాడుతూ, “సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చేరడం విద్యార్థుల జీవితంలో ఒక కీలక దశ. ఇక్కడ లభించే ఆధునిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని హెల్త్ కేర్ రంగంలో ప్రతిభను చాటుకోవాలి” అని సూచించారు. ఫార్మసీ విద్యార్థులు ఔషధ తయారీ, ప్రిస్క్రిప్షన్‌లు, డ్రగ్ అనాలిసిస్‌లో కీలక పాత్ర పోషిస్తారని ఆయన వివరించారు. విద్యార్థులు తార్కిక ఆలోచన, క్రమశిక్షణతో అభ్యాసం చేస్తూ ప్రతిరోజూ కళాశాలకు హాజరు కావాలని, ప్రతి ఒక్కరిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.

డైరెక్టర్ (అక్రిడిటేషన్స్) డాక్టర్ సి. సూబ్బారావు మాట్లాడుతూ, విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకొని అంకిత భావంతో కృషి చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆకాంక్షించారు.సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. జగదీశ్ బాబు విద్యార్థులను ఉద్దేశించి, “చదువుపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం సాధించడం ఖాయం” అని చెప్పారు.డాక్టర్ శామ్‌సన్ మాట్లాడుతూ, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల అభ్యాసం, అభివృద్ధిపై దృష్టి పెట్టి వారిని ప్రోత్సహించాలని సూచించారు.కార్యక్రమంలో ఆర్.వి. రమణమూర్తి (మేనేజర్–అడ్మినిస్ట్రేషన్), అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బి.భవ్య కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button