chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

VIJAYAWADA LOCAL NEWS:సీనియర్ జర్నలిస్ట్ షౌకత్ మృతి పట్ల మీడియా అకాడమీ చైర్మన్ సంతాపం

విజయవాడ, మార్చి 24: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ షౌకత్ హెచ్ మహమ్మద్ (63) అకాల మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షౌకత్, మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా సురేశ్ కుమార్ మాట్లాడుతూ.. షౌకత్ మరణంతో తాను ఒక మంచి మిత్రుడిని, విలువైన సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 1985లో విశాఖపట్నంలో ‘డెక్కన్ క్రానికల్’ ద్వారా జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించిన షౌకత్.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. బిజినెస్ జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన ఆయన, మలయాళ మనోరమ గ్రూపునకు చెందిన ‘ది వీక్’ పత్రికకు తమిళనాడు ప్రతినిధిగా, డెక్కన్ క్రానికల్‌లో బిజినెస్ ఎడిటర్‌గా, టీసీఎస్‌లో సీనియర్ కన్సల్టెంట్‌గా కూడా పనిచేశారు. తన చివరి అసైన్‌మెంట్‌గా విజయవాడలో టైమ్స్ ఆఫ్ ఇండియా స్పెషల్ కరెస్పాండెంట్‌గా సేవలందించారని పేర్కొన్నారు. వృత్తి పట్ల అపారమైన నిబద్ధత కలిగిన షౌకత్ మరణం జర్నలిజం రంగానికి తీరని లోటని పేర్కొంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. షౌకత్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.http://NTR DISTRICT NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker