chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యం📍గుంటూరు జిల్లా

సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్

గుంటూరు, సెప్టెంబర్ 18 : సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా(A.Thameem Ansariya) తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాదులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని,ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలని
కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో ఏ ప్రాంతంలో అయినా ఆరోగ్య సంబంధిత సమస్యలు, అంటు వ్యాధులు, అతిసార, డెంగ్యూ, మలేరియా వంటి ఏ సమస్య ఉన్నా, అనుమానాలు ఉన్నా తక్షణం కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. మరగకాచి చల్లార్చిన మంచినీటిని మాత్రమే త్రాగాలని పిలుపునిచ్చారు. ఏవైనా అనారోగ్య లక్షణాలను గుర్తించిన
వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని అన్నారు. వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని, సురక్షితం లేనివిధంగా విక్రయిస్తున్న ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోరాదని తెలిపారు. వ్యాధులు పట్ల ముఖ్యంగా అంటువ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి, వైద్య అధికారులు, జిల్లా యంత్రాంగం అందిస్తున్న సూచనలు, సలహాలు పాటించి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker