గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్ల పరిసరాల్లో మొక్కలు నాటాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నల్లచెరువు మెయిన్ రోడ్లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు వచ్చే ప్రజలకు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, మొక్కలతో ఆహ్లాధకరంగా ఉండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. క్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. నగరంలోని 7 క్యాంటీన్లలో మొక్కలు నాటడానికి అంచనాలు ఏఈ ల వారిగా సిద్ధం చేయాలన్నారు. క్యాంటీన్లకు వస్తున్న పేదవారికి ఎవ్వరికీ ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదని, అందుకు తగిన విధంగా ఆహారం సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలన్నారు. ప్రజలు క్యాంటీన్ లో అందే ఆహారంపై తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలియ చేయవచ్చన్నారు.
236 Less than a minute