
అమరావతి: డిసెంబర్ 21:-గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని చిన్నజీయర్ ఆశ్రమం సభామండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కులభేదాలు లేని సమైక్య హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) స్థాపనకు వంద సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ సమ్మేళనాన్ని ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటుపడాలని నాయకులు సూచించారు.
కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ర శివన్నారాయణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ, వేగంగా మార్పు చెందుతున్న సమాజంలో జీవిత విలువలను కలిసికట్టుగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న మంగళగిరి మఠం పీఠాధిపతులు భక్తి సుందర మంగళ మహరాజ్ స్వామి మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తి నిర్మాణ కార్యక్రమాల ద్వారా సమాజానికి మార్గదర్శకులను అందిస్తోందని తెలిపారు.

ముఖ్య వక్తగా ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రచారక్ నవీన్ ప్రసంగం ఆకట్టుకుంది. హిందూ ధర్మంలో తల్లికి ఉన్న విశిష్ట స్థానం, కుటుంబ వ్యవస్థలో మాతృమూర్తుల పాత్రను ఆయన వివరించారు.Amravathi cabinet
కార్యక్రమ ప్రారంభంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల గీతాలాపన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సమ్మేళనంలో 500 మందికి పైగా స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కృష్ణకుమార్, పుట్టా భాస్కర్ తదితరులు సమర్థవంతంగా నిర్వహించారు.







