
ఏలూరు జిల్లా:26-11-25:- బుట్టాయగూడెం మండలం కామవరం గ్రామంలోని శివనాగేంద్ర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్టి 10వ మహోత్సవం వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసమారాధన కార్యక్రమాన్ని ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సుమారు 200 మంది భక్తులను భోజనంతో ఆతిథ్యం ఇచ్చారు.
తదుపరి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి వర్ష పుల్లరావు పైకి అమ్మవార్లు అవతరించినట్లు భావించి ఆటపాటలతో నృత్యం చేయడం భక్తులను ఆకట్టుకుంది. ఈ దర్శనాన్ని వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక ఉల్లాసంతో మంత్రముగ్ధులయ్యారు.ఈ మహోత్సవంలో మన్యంపులి మొడియం రమేష్, తెల్లం రమేష్, గోగుల రవి తది







