

అందరికీ నమస్కారం
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం: దివ్యాంగుల పెన్షన్ కోసం సదరం స్లాట్ బుకింగ్ నవంబర్ 14 2025 నుంచి ప్రారంభంకానుంది అని భారత జనతా పార్టీ సీనియర్ నాయకులు పిన్ని. సాంబశివరావు తెలిపారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్న పదివేల మందికి తొలిప్రాధాన్య ఇస్తామన్నారు. దివ్యాంగుల ఆర్థికస్థితిని పరిగణలోకి తీసుకొని స్లాట్ బుకింగ్ సర్టిఫికెట్ ముద్రణకు గతంలో ₹40 చొప్పున ఉన్న ఫీజును రద్దు చేసినట్లు చెప్పారు. సదరం సర్టిఫికెట్ ఆధారంగానే కొత్త పెన్షన్లను అధికారులు మంజూరు చేస్తారని పిన్ని.సాంబశివరావు తెలియజేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సగౌరవంగా తెలియజేశారు.







