అమరజీవి బొంతా వెంకటరత్నం మృతికి నివాళులర్పించిన సిపిఐ నాయకులు.
పల్నాడు జిల్లా,చిలకలూరిపేట
చిలకలూరిపేట నియోజకవర్గం వేలూరు గ్రామానికి చెందిన భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు అమరజీవి కామ్రేడ్ బొంతా వెంకటరత్నం మృతి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి తీరని లోటని చిలకలూరిపేట నియోజకవర్గ సిపిఐ మాజీ ఇన్చార్జి కార్యదర్శి కామ్రేడ్ నాగభైరు రామసుబ్బాయమ్మ అన్నారు. వెంకటరత్నం అనారోగ్యంతో శనివారం అర్ధరాత్రి మృతి చెందగా వారి ప్రార్ధివ దేహానికి గ్రామంలోని వారి గృహం వద్ద ఆదివారం సిపిఐ సీనియర్ నాయకులు కరణం కోటేశ్వరరావు ఎర్రజెండాను కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు తంగిరాల జీవ రత్నం, బొంతా రాజారావు, ఆలూరి పురుషోత్తం, బొంతా జాన్ ,బొంతా శేషయ్య, కామ్రేడ్ బొంతా నీలయ్య, ట్రాక్టర్ రాజా, బొంతా పాపారావు, బొంతా రాజారావు (పంచాయితీ), బొంతా భగత్ సింగ్ గ్రామ పార్టీ సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.