
NTRవిజయవాడ: ఇంద్రకీలాద్రి :14-11-25:-కార్తీక మాసం చివరి వారాంతం కావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం వద్ద భారీ భక్తజనం రద్దీ ఉండనున్నట్లు దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 14, 15, 16 (శుక్రవారం, శనివారం, ఆదివారం) తేదీల్లో ప్రత్యేకంగా ఎక్కువ మంది భక్తులు దర్శనార్ధం తరలివచ్చే అవకాశముండడంతో ముందస్తు చర్యలు చేపట్టారు.కార్తీక మాసం ఈ నెల 20-11-2025తో ముగియనుండటంతో, వానభోజనాలు, వనసమారాధన కార్యక్రమాలు నిర్వహించుకునే భక్తులు అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో రావొచ్చని అధికారులు తెలిపారు.
ప్రత్యేక ఏర్పాట్లు – మార్పులు ఇవే:నవంబర్ 14, 15, 16 తేదీల్లో ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 2:30 వరకురూ. 500 ప్రత్యేక దర్శనం టిక్కెట్ల విక్రయం తాత్కాలికంగా నిలిపివేత.ఇదే సమయాల్లో VIP సిఫార్సు లేఖలకు అనుమతి ఉండదు.రద్దీని నియంత్రించేందుకు ఈ మూడు రోజులలో ఉదయం 11.00–మధ్యాహ్నం 2.30 మధ్య భక్తులందరికీ బంగారు వాకిలి ద్వారా దర్శనం కల్పించనున్నట్లు దేవస్థానం స్పష్టం చేసింది.
భక్తుల సౌకర్యార్థం తీసుకున్న ఈ మార్పులను గమనించి సహకరించాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.ఈ వివరాలను దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ వి.కె. శీనా నాయక్ తెలియజేశారు.







