గీతమ్స్ బ్లూమ్స్ పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా
వినుకొండ: స్థానిక పల్నాడు రోడ్డులోని గీతమ్స్ బ్లూమ్స్ పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరయ్యారు. చిన్నారులు చిన్న కృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు.
కోటిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ,
“శ్రీ కృష్ణాష్టమి అనేది భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించిన పవిత్రమైన రోజు. ఈ రోజున ఊయలలో కృష్ణుడి విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తారు. చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషధారణలతో అందంగా అలంకరిస్తారు” అని తెలిపారు.
వేడుకల్లో ఉట్టికొట్టే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరగా సహపంక్తి భోజనాలతో వేడుకలను ముగించారు. విద్యార్థులకు కృష్ణాష్టమి విశిష్టతను వివరించి, ధార్మిక, సాంస్కృతిక విలువలను అర్థం చేసుకునేలా సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల అందమైన వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకలు విద్యార్థులలో భక్తి భావనను పెంపొందించడమే కాకుండా, మన సాంప్రదాయాల వైభవాన్ని గుర్తు చేశాయి.