chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Mangalagiri Local News :మంగళగిరి-శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణ

మంగళగిరి:- మిద్దె సెంటర్ లోని శ్రీ ప్రపత్తి ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన నరసింహుని దివ్య చిత్రాలతో కూడిన కాలమాని క్యాలెండర్ ను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకి దేవి, స్వచ్ఛ ఆంధ్ర మిషన్ డైరెక్టర్, ట్రస్టు సభ్యురాలు ఆరుద్ర భూలక్ష్మి, పీఏసీఎస్ డైరెక్టర్ అందే శివశంకరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, మయూరి టెక్ బిల్డర్ వింజమూరి శ్రీనివాసరావు, అందే వెంకన్న, జనసేన నాయకులు మునగపాటి వెంకట మారుతీరావు హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర మిషన్ డైరెక్టర్, ట్రస్టు సభ్యురాలు ఆరుద్ర భూలక్ష్మి శ్రీ స్వామివారి కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడేలా సేవా ట్రస్టుకు వెండి బిందెను విరాళంగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ ప్రతి సంవత్సరం స్వామివారి అందమైన చిత్రాలతో క్యాలెండర్ ను రూపొందించి భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని ప్రశంసించారు.Mega Job Fair with 1000+ Splendid Mangalagiri Jobs Opportunities!||Mangalagiri Jobs||అద్భుతమైన అవకాశాల మెగా జాబ్ మేళా

బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు మిద్దె సెంటర్ కు వచ్చినప్పుడు భక్తులకు వివిధ రకాల ప్రసాదాల పంపిణీ చేస్తూ సేవా ట్రస్ట్ భక్తుల మన్ననలు పొందుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ముందుండి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ట్రస్టు వ్యవస్థాపకులు పణిదపు శ్రీనివాసరావు, ట్రస్ట్ సభ్యులు పణిదపు వీరాస్వామి, అందే శ్యాంప్రసాద్, జంజనం నాగేంద్రం, మండ్రు రాము, బట్టు చిదానంద శాస్త్రి, పారేపల్లి దుర్గాప్రసాద్, అద్దంకి వెంకటేశ్వర్లు, శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు జంజన వెంకట సుబ్బారావు, భక్త బృందం ప్రతినిధులు మాజేటి గోపాలకృష్ణ, నేరెళ్ల వేములయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker