పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానం లో ఆషాడ బహుళ పాడ్యమి ధాన్యలక్ష్మి పూజ ను బ్రహ్మ శ్రీమద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహిo చారు రైతులకు, భక్తులకు పూజలు చేసిన గుప్పెడు ధాన్యం. పసుపుకొమ్ము ఉచితంగా అందచేసినారు.సదరు ధాన్యం గింజలు పొలాల్లో చల్లుకొని పసుపు కొమ్మును బీరువాలో పెట్టుకోవాలని, వ్యాపారులు భక్తులు అయితే, దేవునిసన్నిధిలో ధాన్యం, బీరువాలో పసుపు కొమ్ము పెట్టుకోవాలని దేవస్థానం ప్రధాన అర్చకులు తెలియచేసారు. ఈ సందర్బంగా వ్యవసాయం బాగుండాలి అని, తద్వారా వ్యాపారాలు వృద్ధి పొంది,సంపద పెరిగి,అందరూ బాగుండాలి అని, అందుకు శ్రీ మావూళ్ళమ్మ ఆశీస్సులు ఉండాలని అందుకు తగ్గట్టుగా కార్యక్రమాలు చేయాలని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు సూచనలు, ఆదేశాలు మేరకు ధాన్యలక్ష్మి పూజ నిర్వహించడం జరిగినదని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు.
230 Less than a minute