
ముదినేపల్లి, జనవరి 27:-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు మంగళవారం ముదినేపల్లి మండలం చిన్నపూరిగా విరాజిల్లుతున్న వడాలి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాధ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన దేవస్థానం చైర్మన్‌తో పాటు పాలకమండలి సభ్యులను డా. కామినేని శ్రీనివాస్ గారు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

భక్తుల సౌకర్యార్థం అవసరమైన వసతులు కల్పించడంతో పాటు దేవస్థానం సమగ్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.ELURU NEWS.:కోపరేటివ్ సొసైటీ ఉద్యోగుల ధర్నా….
ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్‌రావు గారు, నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వీరమల్లు, ఎన్డీఏ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.







