ఆంధ్రప్రదేశ్
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు.
పల్నాడు జిల్లా ,చిలకలూరిపేట.
చిలకలూరిపేట లో సోమవారం శ్రీ వాసవి సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల కులదేవత “శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి” అమ్మవారి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం శివాలయం నందు గల వాసవి జ్ఞాన మందిరములో అభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో భాగంగా వాసవి మాత అమ్మవారికి 108 రకాల నైవేద్యాలు నివేదన చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణ ఆర్యవైశ్యులు,అమ్మవారి భక్తులు విరివిగా పాల్గొనాన్నురు తదనంతరం1000 మందికి అన్న ప్రసాద వితరణ చేశారు.