ఆంధ్రప్రదేశ్
AP LATEST NEWS: బాండ్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై విజిలెన్స్, సీఐడీలతో విచారణ
MINISTER NARAYANA STATMENT
గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగాయని మంత్రి నారాయణ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. ఈ బాండ్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై విజిలెన్స్, సీఐడీలతో విచారణ చేయిస్తామన్నారు. వాటి నుంచి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో తణుకు, తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయి. తణుకులో 63 కోట్ల విలువ ఉంటే 754 కోట్లకు బాండ్లు ఇచ్చారు. తిరుపతిలో 170 కోట్లకు 29 టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. ప్రస్తుతం 965 టీడీఆర్ బాండ్లు పెండింగ్ లో ఉన్నాయి. మూడు నెలల్లోపు వీటి అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తాం” అని నారాయణ తెలిపారు.