మంగళగిరి, అక్టోబర్ 7 : తెలుగుదేశం పార్టీ నేత, పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ ఏవీ రమణను శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా నియమించిన సందర్భంగా మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహం వద్ద దేశం తమ్ముళ్లు ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి, పూల మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుంచి రమణ పార్టీ అభివృద్ధికి నిరంతరంగా సేవలందిస్తున్నారని ప్రశంసించారు. ఒక సమయంలో హైదరాబాద్ టీడీపీ కార్యాలయంలో, ప్రస్తుతం అమరావతిలోని కేంద్ర కార్యాలయంలో సమర్థవంతంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణలో రమణ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి ఆయన సేవలు మరింత ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
సత్కార కార్యక్రమంలో కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి విన్నకోట శ్రీనివాసరావు, టీడీపీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి చీకుల వెంకటేశ్వరరావు, నేతలు మల్లాది శ్రీనివాస్, ఆళ్ల శ్రీనివాసరావు, షేక్ ఇంతియాజ్, సాహెషా తదితరులు పాల్గొన్నారు.