
చీరాల: 18-02-2026:-జాతీయ స్థాయి క్రీడా పోటీలలో St. Ann’s College of Engineering and Technology విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటారు. Vignan University, వడ్లమూడి వేదికగా నిర్వహించిన జాతీయ స్థాయి యూత్ ఫెస్టివల్ “విజ్ఞాన్ ఉత్సవ్–2026” లో జరిగిన వాలీబాల్ పోటీలలో సెయింట్ ఆన్స్ కళాశాల జట్టు రన్నర్స్‌గా నిలిచి ప్రశంసలు అందుకుంది.
దేశవ్యాప్తంగా పాల్గొన్న 46 జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోటీలలో సెయింట్ ఆన్స్ జట్టు ఫైనల్స్ వరకు దూసుకెళ్లి ఎస్.ఆర్.ఎన్ జట్టుతో తలపడి రన్నర్స్‌గా నిలిచింది. జట్టు నగదు బహుమతిని కూడా కైవసం చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జగదీష్ బాబు తెలిపారు.
ఈ జట్టులో ఆర్. రమణ, జి.వి.ఆర్. తేజా రెడ్డి, కె. ఆండ్రూస్, జి. మైకేల్, కె. డాని, కె. సాయి కుమార్, ఎం. రేవంత్ వెంకట మణి కుమార్ సభ్యులుగా పాల్గొన్నారు. విద్యార్థులను వ్యాయామ అధ్యాపకులు అన్నం శ్రీనివాసరావు అభినందించారు.
అదేవిధంగా తైక్వాండో పోటీలలో షాహిద్, అభిరామ్‌లు అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించగా, అభిరామ్ ఒక రజత పతకాన్ని కూడా గెలుచుకున్నట్లు కళాశాల వర్గాలు వెల్లడించాయి.
ఈ విజయోత్సవ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ యస్. లక్ష్మణరావు విద్యార్థులను అభినందించారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్.వి. రమణమూర్తి, డైరెక్టర్ (అక్రిడిటేషన్స్) డా. సి. సుబ్బారావు, డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) వనమా దొర నాగ సాయినాద్ తదితరులు హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు.Chirala Local News
జాతీయ స్థాయిలో రన్నర్స్‌గా నిలిచిన ఈ విజయం కళాశాలకే కాకుండా చీరాల ప్రాంతానికి గర్వకారణమని విద్యార్థులు, అధ్యాపకులు అభిప్రాయపడ్డారు.









