chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Chirala Local News :St. Ann’s College of Engineering and Technology విద్యార్థుల క్రీడా ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు

చీరాల: 18-02-2026:-జాతీయ స్థాయి క్రీడా పోటీలలో St. Ann’s College of Engineering and Technology విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటారు. Vignan University, వడ్లమూడి వేదికగా నిర్వహించిన జాతీయ స్థాయి యూత్ ఫెస్టివల్ “విజ్ఞాన్ ఉత్సవ్–2026” లో జరిగిన వాలీబాల్ పోటీలలో సెయింట్ ఆన్స్ కళాశాల జట్టు రన్నర్స్‌గా నిలిచి ప్రశంసలు అందుకుంది.

దేశవ్యాప్తంగా పాల్గొన్న 46 జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోటీలలో సెయింట్ ఆన్స్ జట్టు ఫైనల్స్‌ వరకు దూసుకెళ్లి ఎస్.ఆర్.ఎన్ జట్టుతో తలపడి రన్నర్స్‌గా నిలిచింది. జట్టు నగదు బహుమతిని కూడా కైవసం చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జగదీష్ బాబు తెలిపారు.

ఈ జట్టులో ఆర్. రమణ, జి.వి.ఆర్. తేజా రెడ్డి, కె. ఆండ్రూస్, జి. మైకేల్, కె. డాని, కె. సాయి కుమార్, ఎం. రేవంత్ వెంకట మణి కుమార్ సభ్యులుగా పాల్గొన్నారు. విద్యార్థులను వ్యాయామ అధ్యాపకులు అన్నం శ్రీనివాసరావు అభినందించారు.

అదేవిధంగా తైక్వాండో పోటీలలో షాహిద్, అభిరామ్‌లు అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించగా, అభిరామ్ ఒక రజత పతకాన్ని కూడా గెలుచుకున్నట్లు కళాశాల వర్గాలు వెల్లడించాయి.

ఈ విజయోత్సవ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ యస్. లక్ష్మణరావు విద్యార్థులను అభినందించారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్.వి. రమణమూర్తి, డైరెక్టర్ (అక్రిడిటేషన్స్) డా. సి. సుబ్బారావు, డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) వనమా దొర నాగ సాయినాద్ తదితరులు హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు.Chirala Local News

జాతీయ స్థాయిలో రన్నర్స్‌గా నిలిచిన ఈ విజయం కళాశాలకే కాకుండా చీరాల ప్రాంతానికి గర్వకారణమని విద్యార్థులు, అధ్యాపకులు అభిప్రాయపడ్డారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker