
చీరాల :06-12-2025:-స్ట్.యాన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో ఒయాసిస్ ఆటోమేషన్ టెక్నాలజీస్ సంస్థ క్యాంపస్ ఎంపికలను నిర్వహించినట్లు కాలేజ్ కార్యదర్శి వనం రామకృష్ణరావు, ప్రతినిధి శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కంపెనీ స్థాపన, సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు, ఎంపిక కాబోయే విద్యార్థులకు ఆఫర్ చేసే బాధ్యతలు, అర్హతలు, సౌకర్యాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను అందించారు.

క్యాంపస్ సెలెక్షన్స్‌కు ఈసారి బీఈసీ శాఖ నుంచి 120మంది, ఈఈఈ శాఖ నుంచి 40మంది విద్యార్థులు హాజరయ్యారని కాలేజ్ ప్రిన్సిపాల్ డా. కె. జగదీష్ బాబు తెలిపారు. తొలి రాత పరీక్షలో ఈసీఈ నుంచి 90మంది, ఈఈఈ నుంచి 28మంది విద్యార్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.ఈ ఎంపికల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.3 లక్షల వేతనం, ఇతర అలవెన్సులు అందజేయనున్నట్లు సెలెక్షన్ ఆఫీసర్ వై. పూర్ణచంద్రరావు వెల్లడించారు.క్యాంపస్ నియామకాల్లో శిక్షణ, ప్లేస్‌మెంట్ వ్యవహారాలను కాలేజ్ ట్రైనింగ్ & పే ప్లేస్‌మెంట్ అధికారి పర్యవేక్షించారు.







