
అమరావతి, అక్టోబర్ 12:
సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తిపై జరిగిన బూటు దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ఆ ఘటనపై చర్చ జరగాలని కోరుతూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ASA) రేపు 13 న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కిపిలుపునిచ్చింది.GUNTUR: గుంటూరులో వామపక్షాల ఆందోళన

ASA రాష్ట్ర అధ్యక్షుడు సర్ధార్ షఫీ హరన్, రాష్ట్ర కార్యదర్శి శబరీష్ నాయుడు, వైస్ సెక్రటరీలు బన్నీ మరియు ఇస్లాం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు:
“ఈ ఘటన న్యాయ వ్యవస్థపై ముద్ర వేసే విధంగా జరిగింది. దానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అలాగే న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నాం” అని వారు పేర్కొన్నారు.
ASA నాయకత్వం తెలిపిన ప్రకారం, ఈ బంద్‌లో SC, ST, BC, మైనారిటీ మరియు OC విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా LKG నుండి PG వరకు విద్యాసంస్థలు మూతపడాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యా శాఖ అధికారులు బంద్‌కి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ASA నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ,
“ఈ బంద్ పూర్తిగా శాంతియుతంగా ఉంటుంది. ఎటువంటి అశాంతి లేదా అవాంఛనీయ పరిస్థితులు సృష్టించకూడదు. విద్యా రంగంలో సామాజిక న్యాయం చర్చించబడాలన్నదే మా ఉద్దేశం” అన్నారు.
 
 
 
  
 






