కృష్ణాజిల్లా:గుడివాడ సెప్టెంబర్ 19: గతపాలకుల అనాలోచిత విధానాలతో టిడ్కో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నా రని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కాలనీ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని టిడ్కో కాలనీలో రూ.40 లక్షల మున్సిపల్ నిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్న సబ్ మర్సబుల్ బోర్ల పనులకు ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ టిడ్కో కాలనీ ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు8 బోర్ల ఏర్పాటుతో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నామని, శానిటేషన్ సమస్య పరిష్కారం పైకూడా ప్రత్యేకదృష్టి పెట్టామన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ P. శ్రీనివాసరావు,DE M. శివాజీ, I/C అసిస్టెంట్ ఇంజనీర్ బాలశివాజీ, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు,యేసుపాదం, సయ్యద్ జబీన్,మహికీర్తి ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
212 Less than a minute